నాగార్జున వేసుకునే కాస్ట్యూమ్స్ మరీ అంత కాస్టా!
on Dec 7, 2022
బిగ్ బాస్ ఇప్పుడు ప్రస్తుతం క్రేజ్ లో ఉన్న రియాలిటీ షో. దీనికి ఉన్న ఫాలోయింగ్ చూస్తే మతిపోతుంది. ఎందుకంటే సెలబ్రిటీలు కూడా ఈ షోని ఇంట్రెస్ట్ గా చూస్తూ సోషల్ మీడియాలో అప్డేట్ ఇస్తూ ఉంటారు. అదేకాక భారీ అంచనాలు, వాటికి తగ్గట్టుగా ఒక్కో కంటెస్టెంట్ కి భారీ రెమ్యూనరేషన్ తో దూసుకుపోతున్న షో అని అనడంలో ఆశ్చర్యమే లేదు.
అందులోనూ వీకెండ్ లో వచ్చే నాగార్జున కోసం ఎంతో మంది ఫ్యాన్స్ ఎదురు చూస్తుంటారు. కాగా నాగార్జున శని, ఆదివారాల ఎపిసోడ్స్ షూటింగ్ కోసం ఏ దేశంలో ఉన్నా సరే కచ్చితంగా అటెండ్ అవుతారన్న విషయం తెలిసిందే. అయితే వీకెండ్స్ లో వచ్చే నాగార్జున వేసుకునే ఒక్కో డ్రస్ ధర చూస్తుంటే నెటిజన్లు షాక్ అవుతున్నారు. కాగా ఇప్పుడు ఈ న్యూస్ వైరల్ గా మారింది. మొన్నటి ఎపిసోడ్ లో వేసుకున్న ఒక్క షర్ట్ ధర సుమారుగా రెండు లక్షలు ఉంది. అయితే ఈ విషయం తెలుసుకొని, సోషల్ మీడియాలో నెటిజన్లు మాత్రం అవాక్కవుతున్నారు. ఒక్క షర్ట్ కే అంత ధర ఉంటే ఇంక నాగార్జున రెమ్యూనరేషన్ ఏ స్థాయిలో ఉంటుందని ప్రేక్షకులు అంచనాలు వేస్తున్నారు.
మరికొందరు అయితే "నాగార్జున ఒక వీకెండ్ ధరించే దుస్తులతో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సంవత్సరమంతా బ్రతికేస్తారు" అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. కాగా బిగ్ బాస్ ఈ సీజన్ మొదలై ఇప్పటికి పదమూడు వారాలు కాగా, అందులో శనివారం ఆదివారాల్లో నాగార్జున కాస్ట్యూమ్స్ కి సుమారుగా కోటి రూపాయల వరకు ఖర్చు ఉండొచ్చని వీక్షకులు భావిస్తున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు.